వరికుంటపాడు: ఆ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

66చూసినవారు
వరికుంటపాడు: ఆ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
వరికుంటపాడు మండలం తోటలచెరువు పల్లి వద్ద శుక్రవారం రాత్రి ఓ బుల్లెట్ బైక్ ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో పెద్దిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అడుసుమల్లి వెంకటరమణయ్య (65) తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా వారిలో ఇద్దరు నెల్లూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్