వరికుంటపాడు: రేషన్ బియ్యం కోసం మహిళలు పడిగాపులు

54చూసినవారు
వరికుంటపాడు: రేషన్ బియ్యం కోసం మహిళలు పడిగాపులు
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం. రేషన్ లబ్ధిదారులకు శాపంలా మారింది. వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల గ్రామంలో మే నెల 16 వ తేదీ దాటినా రేషన్ పంపిణీ చేయలేదు. దీంతో శుక్రవారం ఉదయం నుంచే క్యూలో సంచులు పట్టుకొని లబ్ధిదారుల ఎదురుచూపులు చూస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఎండీయూ వాహనాలు రేషన్ పంపిణీ చేయడంలేదు. ఎండీయూ వాహనాలు బియ్యం పంపిణీ చేయకపోవడం ఇక్కడ మాత్రమే కాదు జిల్లాలో చాలా గ్రామాల్లోనూ ఇదే సమస్య ఉంది.

సంబంధిత పోస్ట్