నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడులో శనివారం యోగాంధ్ర-2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల చేత సచివాలయం సిబ్బంది యోగాసనాలు వేయించారు. అలాగే యోగాపై అవగాహన కల్పించి యోగా చేయడం వల్ల వచ్చే లాభాలను వివరించారు. ప్రతిరోజు యోగా చేయడం అలవాటు చేసుకోవాలని ప్రతిరోజు యోగా చేయడం వలన మానసిక, శారీరక ఇబ్బందులు కలగవని తెలిపారు. ఆరోగ్యమైన జీవితానికి యోగా ఎంతో కీలకమని అన్నారు.