నెల్లూరు జిల్లా, వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లి గ్రామపంచాయతీలో యోగాంధ్ర- 2025 కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయం సిబ్బంది, అంగన్వాడి ఉద్యోగులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు యోగాంధ్ర ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతసేపు యోగ ఆసనాలు వేశారు. యోగా వేయడం ద్వారా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.