నర్రవాడ వీధి లైట్ల పనిచేయకపోవడంతో గ్రామస్తుల ఆందోళన

62చూసినవారు
నర్రవాడ వీధి లైట్ల పనిచేయకపోవడంతో గ్రామస్తుల ఆందోళన
దుత్తలూరు మండలంలోని  మాజారా ఉలవవారిపాలెం గ్రామంలో గత కొన్ని రోజులుగా వీధి లైట్లు పనిచేయడం లేదని స్థానికులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళ వీధుల్లో చీకటి  నెలకొనడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. రాత్రి పూట విష సర్పాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు స్పందించి ఇప్పటికైనా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్