ఈరోజు వీచినటువంటి ఈదురు గాలుల వల్ల ఇప్పటివరకు పలు గ్రామాల్లో స్తంభాలు పడిపోవడం చెట్లు నేలకొరవడం జరిగింది. కానీ గాలి తీవ్రత వల్ల వింజమూరు- కలిగిరి మధ్యలో ఓ రోడ్డు ప్రమాదం కూడా జరిగింది. ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా గాలి తీవ్రతను తట్టుకోలేక అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి స్వల్ప గాయాలు అవ్వగా బైక్ కొంతమేర దెబ్బతిన్నట్లు సమాచారం. తక్కువ స్పీడ్ లో వెళ్లడం వల్ల ఎక్కువ ప్రమాదం జరగలేదు.