వింజమూరు మండలం లోని చాకలికొండ ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని పిహెచ్సి డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ కలసపాటి వెంకటసుబ్బయ్య శనివారం పరిశీలించారు. వసతి గృహంలోని రికార్డులు తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, టాయిలెట్లు, వంటగది, తాగునీరు సరఫరా, విద్యార్థులు నివాస గదులు పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. వైద్య పరంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు.