వింజమూరు ఉప సర్పంచ్ రాజీనామా

64చూసినవారు
వింజమూరు ఉప సర్పంచ్ రాజీనామా
ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పంచాయతీ ఉపసర్పంచ్ ముడదాల విజయలక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. వింజమూరు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డికి గురువారం విజయలక్ష్మి తన రాజీనామా లేఖ అందజేశారు. అయితే ఉప సర్పంచ్ రాజీనామా చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో కారణం తెలియలేదు. తదుపరి ఉప సర్పంచ్ గా గున్న సుశీల ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్