వింజమూరు: రూ.3 లక్షల సీఎం సహాయనిధి అందజేసిన ఎమ్మెల్యే

72చూసినవారు
వింజమూరు: రూ.3 లక్షల సీఎం సహాయనిధి అందజేసిన ఎమ్మెల్యే
వింజమూరు మండలం చాకలకొండ గ్రామానికి చెందిన పోలుబోయిన ప్రసాద్ సతీమణి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా 6 లక్షల పైచిలుకు నగదు ప్రైవేటు ఆసుపత్రిలో ఖర్చు చేశారు. అయినప్పటికీ ఆమె తిరిగిరాని లోకానికి వెళ్ళింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేయగా రూ.3 లక్షలు సీఎం సహాయనిధి మంజూరు అయింది. మంగళవారం ఎమ్మెల్యే బాధితుడికి ఆ చెక్కు అందజేశారు.

సంబంధిత పోస్ట్