నెల్లూరు జిల్లా వింజమూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు ఉదయగిరి నియోజకవర్గ విశాలాంధ్ర పత్రిక విలేకరులందరూ కలిగిరి, కొండాపురం మండల నాయకులతో కలసి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చేతుల మీదుగా విశాలాంధ్ర క్యాలెండర్ ను శనివారం ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాలాంధ్ర పత్రిక నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజల పక్షాన నిలుస్తుంది అన్నారు.