ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో వింజమూరు పట్టణంలోని బంగ్లా సెంటర్ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు శుక్రవారం సాయంత్రం తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో వందల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జాతీయ జెండాను పట్టుకొని తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారతదేశం పవర్ ఏంటో పాకిస్తాన్ కి చూపించామని, ప్రపంచ దేశాలు సైతం భారత్ గురించి మాట్లాడుకునేలా చేసామని ఎమ్మెల్యే అన్నారు.