సోమశిల జలాశయం నుంచి 4500 క్యూసెక్కుల నీటిని బుధవారం దిగువకు విడుదల చేశారు. సోమశిలలో ప్రస్తుతం 39.448 టీఎంసీల నీరు ఉందని, దక్షిణ కాలువకు 350, ఉత్తర కాలువకు 300, పెన్నా డెల్టాకు 3,850 క్యూసెక్కుల సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 230 క్యూసెక్కుల నీరు వృథా అవుతోందని వివరించారు.