కలిగిరి మండల వ్యవసాయ అధికారి గా షేక్. జహీర్ నియమితులయ్యారు. జహీర్ శుక్రవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మండలంలోని విఏఏలు, వీహెచ్ఏ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ, ఈ కేవైసీ త్వరితగిన పూర్తి చేయాలన్నారు. అలాగే రైతులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తనకు చెప్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాగా మనుబోలు మండలం నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు.