ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తమ ప్లాట్‌ఫామ్‌లో త్వరలో విడుదల కానున్న సినిమాల జాబితాను సోమవారం ప్రకటించింది. వాటిలో ప్రధానంగా మాధవన్, నయనతార, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘టెస్ట్’, సైఫ్ అలీఖాన్ 'జ్యువెల్ థీఫ్', రాజ్‌కుమార్ రావు నటించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ టోస్టర్, మాధవన్ హీరోగా రూపొందిన ఆప్ జైసా కోయి, సైఫ్ తనయుడు ఇబ్రహీం నటించిన తొలి చిత్రం నాదానియా ఉన్నాయి.