ఏపీలో కొత్త జిల్లాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు మంత్రులతో జరిపిన చర్చల్లో భాగంగా.. ఎన్నికల సమయంలో జిల్లాల పునర్విభజనపై కూటమి ఇచ్చిన హామీలపై త్వరితగతిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా, పోలవరం ముంపు మండలాలు, ప్రత్యేక జిల్లాల ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.