వరుసగా అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే అనర్హత వేటు పడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న హెచ్చరికలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. జగన్ ను టార్గెట్‌గా చేసుకుని రఘురామ ఈ వ్యాఖ్యలు చేసినా, అసెంబ్లీకి రాని మిగతా 10 మంది ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు పడటం ఖాయమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వరుసగా 60 రోజులు సభకు డుమ్మా కొట్టే ఏ ఎమ్మెల్యేలపైన అయిన అనర్హత వేటు వేయొచ్చని డిప్యూటీ స్పీకర్ రఘురామ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.