ఏపీలో కొత్తగా నేషనల్ హైవే నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిడుగురాళ్ళ మీదుగా హైదరాబాద్‌కు కనెక్టవిటీని పెంచేందుకు అడుగులు వేసింది. వాడరేవు- పిడుగురాళ్ల మధ్య నేషనల్ హైవే 167ఏను నిర్మించనుంది. ఈ మేరకు బాపట్ల జిల్లాలో పనుల్ని వేగవంతం చేసింది. దీంతో బాపట్ల జిల్లాలో రూపురేఖలు మారనున్నాయి. కోస్తాలో వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారి కీలకమైంది.