AP: రైతులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూములు రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో గతంలో ఇచ్చిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకొని 'ఆంధ్రప్రదేశ్ రాజముద్ర' ఉన్న వాటిని ఇవ్వనున్నారు. పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఉండటంతో రైతులు తిరస్కరిస్తున్నారని మంత్రి అనగాని CM చంద్రబాబుకు తెలిపారు. అలాగే సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు కూడా మార్చి నాటికి తొలగిస్తామన్నారు.