సంక్రాంతి నుంచి మరో కార్యక్రమం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి నుంచి పీ4 కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే దేశంలో పేదరిక నిర్మూలన కోసం పీ4 మోడల్ అమలు చేయాలని జులైలో జరిగిన నీతి అయోగ్ భేటీలో చంద్రబాబు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. పీ4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్ అని అర్థం.