ఆంధ్రప్రదేశ్‌లో పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టులో క్యూఆర్ కోడ్‌తో వివరాలు కనిపించేలా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. వీటిలో నేతల ఫోటోలు ఉండవు, ప్రభుత్వ చిహ్నం, లబ్ధిదారు ఫోటో మాత్రమే ఉంటుంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల మందికి ఈ స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.