నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు

53చూసినవారు
నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు
AP: రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో కొత్త ఛార్జీలు తప్పించుకునేందుకు శుక్రవారం రాత్రి 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 14250 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రోజుకు 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో దాదాపు 170 వరకు జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.220 కోట్ల ఆదాయం వచ్చింది.

సంబంధిత పోస్ట్