దేశంలో త్వరలో రూ.20 విలువైన కొత్త కరెన్సీ నోట్లు చలామణిలోకి రానున్నాయి. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌లో భాగంగా విడుదల చేయనున్నట్లు RBI ప్రకటించింది. ఇందులో తాజా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని తెలిపింది. డిజైన్ మాత్రం ప్రస్తుతం ఉన్న నోట్ల మాదిరిగానే ఉంటుందని స్పష్టం చేసింది. సాధారణంగా కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, వారి సంతకంతో కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేస్తూ ఉంటుంది.