AP: వైద్యుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో నవజాత శిశువు మృతి చెందింది. ఈ విషాద ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి ప్రభుత్వ ఆస్పతిలో జరిగింది. పెదమడికి చెందిన ధరణి బిడ్డకు జన్మనిచ్చారు. బాబులో కదలికలు లేకపోవడంతో అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాబు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు చనిపోయాడని కొత్తపల్లి ఆస్పత్రి వద్ద కుటుంబీకులు ఆందోళన చేశారు.