AP: సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం భేటీ అయింది. తొలుత సుమన్ బేరికి మంత్రి పుష్పగుచ్ఛం ఇచ్చి, ఘన స్వాగతం పలికారు. అనంతరం సచివాలయంలో శుక్రవారం ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2047- విజన్ డాక్యుమెంట్‌పై చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.