లోక్సభ ఎన్నికలకు ముందు బిహార్లో
రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, ఆర్జేడీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో కూటమితో తెగతెంపులకు సీఎం నితీష్ కుమార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
బీజేపీ కూటమితో చేతులు కలిపేందుకు నితీష్ కుమార్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా సీఎం పదవికి నితీష్ కుమార్ శనివారం రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.