ఏపీలో మద్యం వ్యాపారం తప్ప మరే ఇతర బిజినెస్‌లు సాగడం లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సంపద సృష్టిస్తామని హామీలు ఇచ్చి, 30% అప్పులు పెంచారని బుగ్గన ఫైర్ అయ్యారు. GST వసూళ్లలోనూ 24% ఆదాయం తగ్గిందన్నారు. అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు, నెలకు రూ.1,500 ఎక్కడ ఇస్తున్నారని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన ప్రశ్నించారు. పథకాలపై ప్రశ్నిస్తే కూటమి నేతలు బెదిరిస్తున్నారని అన్నారు.