నేడు సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ ‍పై అవిశ్వాస తీర్మానం

61చూసినవారు
నేడు సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ ‍పై అవిశ్వాస తీర్మానం
కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ అరుణపై నేడు అవిశ్వాస తీర్మానం జరగనుంది. మొత్తం 31 మంది కౌన్సిలర్లలో 29 మంది వైసీపీకి, ఇద్దరు టీడీపీకి చెందినవారు. ఇందులో 22 మంది వైసీపీ కౌన్సిలర్లు చైర్‌పర్సన్ అరుణపై అవిశ్వాస తీర్మానం కోరగా, తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ తరఫున వారికి విప్‌ కూడా జారీ అయింది. ఇప్పటికే వైసీపీ అరుణను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్