జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేస్వామి సూచించారు. ఏపీలో గులియన్-బారె సిండ్రోమ్‌తో మహిళ మృతి చెందిన ఘటనపై మంత్రి స్పందించారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని, ఈ వ్యాధికి అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే డాక్టర్లు వెంటనే వైద్యం అందించాలని సూచించారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అపోహలు తొలగించాలని ఆదేశించారు.