AP CRDA లేఖకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పింది. టెండర్ ప్రక్రియకు ఎలాంటి అభ్యంతరం లేదని EC వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని పనులు నిలిచిపోగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యతా క్రమంలో పనులు వేగవంతం చేసింది. అయితే, రాజధాని పనుల టెండర్లకు MLC కోడ్ అడ్డంకిగా మారిపోయిందని CRDA లేఖ రాసింది. రాజధాని పనులకు ఎలాంటి అభ్యంతరం లేదని EC స్పష్టం చేసింది.