పాత పన్ను విధానాన్ని రద్దు చేసే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. 1961లో తీసుకొచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు, చేర్పులతో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు.