లోక్‌సభలో ధన్యవాద తీర్మానం కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పదేళ్లలో దేశంలో ఎలాంటి స్కాం జరగలేదని, అవినీతి రహిత పాలన అందించామని అన్నారు. యువత ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని, మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. అలాగే ఇథనాల్ బ్లెండింగ్‌తో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో పేదలకు రూ.1.20 లక్షల కోట్లు ఆదా అవుతుందని వెల్లడించారు.