'కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యేక సందేశం రాలేదు'

79చూసినవారు
'కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యేక సందేశం రాలేదు'
కేరళ జల ప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. వర్షాలకు కొండ చరియలు విరిగిపడి ఊళ్లపై పడిన ఘటనలో మృతుల సంఖ్య 287కు చేరింది. అయితే కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై కేరళను ముందే హెచ్చరించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై కేరళ మంత్రి వీణాజార్జ్ స్పందించారు. విపత్తుపై కేంద్రం నుంచి తమకి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు రాలేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్