ఈ నెలాఖరులో నామినేటెడ్ పోస్టుల భర్తీ: సీఎం చంద్రబాబు

73చూసినవారు
ఈ నెలాఖరులో నామినేటెడ్ పోస్టుల భర్తీ: సీఎం చంద్రబాబు
AP: నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులో ఏపీలో మిగిలిన అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. దేవాలయాల పాలక మండళ్లు, మార్కెట్ యాడ్ చైర్మన్ ల పదవులను భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు. ఇటీవల రాష్ట్రంలో కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా.. సీఎం తాజా ప్రకటనతో ఆశావహులు ఈ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీ నాయకులకు ఈ పదవులు దక్కనున్నాయనే ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్