AP: టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలకు టీటీడీ సిద్ధమయింది. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు టీటీడీ ఆదేశించింది. ఇకపై వీరిని టీటీడీ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధులకు నియమించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 18 మందిని వెంటనే బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.