ఏపీలో ఆగని డోలి మోతలు

65చూసినవారు
AP: గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. అల్లూరి జిల్లా చింతపల్లిలో డోలీలో గర్భిణీ లక్ష్మీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరో వైపు పాడేరులో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడిని డోలి కట్టి వాగు ప్రవాహం దాటించి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఇటీవలే గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్.. రోడ్లు వేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్