ఎన్నికల ముందు బడికి వెళ్లే ప్రతి పిల్లాడికి తల్లికి వందనం పథకం కింద రూ.15000 ఇస్తామన్న చంద్రబాబు.. ఏడాది తరువాత వంచన చేస్తున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రలో మొత్తంగా ఉన్న పిల్లలు 87,41,885, కాని ప్రభుత్వం 67,27,164 మంది మాత్రమే ఇస్తామంటోంది. తీరా ప్రకటించిన డబ్బులు చూస్తే కేవలం 58 లక్షల మందికే. ఇది మోసం కాదా? వంచన కాదా? అని ఫైర్ అయ్యారు