ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్యసేవల నియామక బోర్డు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ భర్తీలను చేపట్టనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం https:/dme.ap.nic.in, https:/apmsrb.ap.gov.in/srb/ వెబ్సైట్లను క్లిక్ చేయండి. ఆసక్తి కలిగిన వారు వచ్చే నెల 9 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.