AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా, వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది.