ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్లు నెయ్మార్, టెవెజ్, రొనాల్డో బర్త్ డే సందర్భంగా 'ఫిఫా వరల్డ్' కప్ ఇంట్రెస్టింగ్‌గా విష్ చేసింది. ఈ ముగ్గురూ 'RRR' సినిమాలోని నాటునాటు స్టెప్ వేసినట్లు పోస్టర్ రూపొందించింది. అలాగే వారి పేరులోని తొలి అక్షరం వచ్చేలా NTR అని ఉంచి వారి ఫొటోలతో కూడిన పోస్టర్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీనికి ఎన్టీఆర్, RRR టీమ్ సభ్యులు సైతం స్పందిస్తూ వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.