వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల క్రితం విజయమ్మ కారు ప్రమాదానికి గురైతే అందులో కుట్ర కోణం ఉందంటూ ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. 'ఎన్టీఆర్ చనిపోవడానికి చంద్రబాబు కారణం అనే విషయం సమాజం ఎప్పటికి మరిచిపోదు. ఎన్నికల ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురవ్వడంలోనూ కుట్ర కోణం ఉందని అనుకోవచ్చా?' అని ఆయన టీడీపీ నేతలను ప్రశ్నించారు.