పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహించనున్నట్లు కర్లపాటి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సామాజికవేత్త కర్లపాటి వెంకట శ్రీనివాసరావు తెలిపారు. శనివారం జగ్గయ్యపేటలోని ట్రస్ట్ కార్యాలయంలో హెచ్ఐవి బాదిత పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. 2021వ సంవత్సరం జూన్ 1వ తారీకున ప్రారంభించిన ఈ పంపిణీ కార్యక్రమం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగిందన్నారు.