మధ్యాహ్నం భోజనం పథకం సమర్థవంతంగా అమలు చేయాలి
By పల్లె పాము అర్జునరావు 83చూసినవారుజిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలుచేసేందుకు కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. సృజన తెలిపారు. బుధవారం కలెక్టర్ సృజన మైలవరం మండలంలోని చిలుకూరివారి గూడెం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో బోధన ప్రణాళిక నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా. లేదా? అనే విషయాన్ని పరిశీలించారు.