గొల్లపూడిలోని మైలవరం ఎమ్మెల్యే కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు ఎగురవేశారు. అనంతరం దివంగత నేతలు మహాత్మా గాంధీ చిత్ర పటానికి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.