
పీఎస్ఆర్ ఆంజనేయులుపై మరో కేసు
AP: ముంబై నటి జెత్వానీ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఆంజనేయులు ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఆన్సర్ షీట్ల మూల్యాంకనంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదు అందింది. 402, 420 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో ఆంజనేయులుపై ఇప్పటివరకు మూడు కేసులు నమోదయ్యాయి.