గంపలగూడెం మండలం పెనుగొలను లో శనివారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దాసరి 150 పైగా చిత్రాలకులకు దర్శకత్వం వహించి, లిమ్కా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారని పలువురు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాయిబాబా సేవా కమిటీ ఆర్గనైజర్ సూరం శెట్టి రామయ్య, మాజీ సర్పంచి సంగెపు నారాయణ, సహకార సంఘ మాజీ అధ్యక్షులు నంబూరు శ్రీనివాసరావు, తన్నీరు వెంకటేశ్వరరావు, నాగళ్ళ మురళి తదితరులు పాల్గొన్నారు.