గంపలగూడెం: వైభవంగా హరే రామ నామ సంకీర్తన

85చూసినవారు
గంపలగూడెం: వైభవంగా హరే రామ నామ సంకీర్తన
గంపలగూడెం మండలం పెనుగొలనులో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శనివారం హరే రామ నామ సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా నిర్వహించారు. పాకిస్తాన్ మీద ధర్మ యుద్ధం చేస్తున్న భారత సైన్యానికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 11, 12 తేదీల్లో
బోటి మీద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద హరే రామ నామ సంకీర్తన నిర్వహిస్తున్నట్లు సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్