తిరువూరు నియోజకవర్గ తిరువూరు సిఐ కార్యాలయంలో గురువారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ గిరిబాబు మాట్లాడుతూ, స్వతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారని ఆయన అన్నారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.