పెనుగొలను లో ప్రముఖ నటుడు నాగభూషణం వర్ధంతి

74చూసినవారు
పెనుగొలను లో ప్రముఖ నటుడు నాగభూషణం వర్ధంతి
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను లో ఆదివారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ చలనచిత్ర, రంగస్థల నటుడు చుండి నాగభూషణం వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాగభూషణం 350 పైగా చలనచిత్రాలలో, రక్త కన్నీరు నాటకం ను, అయిదువేల పైగా ప్రదర్శనల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన గొప్ప నటుడని పలువురు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్