బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తిరువూరు కోర్టులో న్యాయవాదుల చేత, న్యాయవాద గుమస్తాల చేత, కోర్టు సిబ్బంది చేత, పోలీసు వారి చేత బుధవారం తిరువూరు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కె. మోతిలాల్ ప్రమాణం చేయించారు. ఈ సందర్బంగా భాల్య వివాహలు చేయటం వల్ల కలుగు నష్టాలు వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ బడే మియా, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.