నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కానుంది. శనివారం మధ్యాహ్నం విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంకు శ్రీకారం చుట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 475 కాలేజీల్లో జరిగే ఈ కార్యక్రమం కోసం రూ. 115 కోట్లు కేటాయించింది.